ఈ జపనీస్ టెక్నిక్స్ తెలిస్తే ఈజీగా లక్షాధికారులు మీరే అవుతారు
Knowing these Japanese techniques will easily make you millionaires

చాలా మందికి డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలిసుండదు. దానివల్ల వాళ్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే ఇప్పుడు ఇందుకో పరిష్కారం లభించింది. కాకీబో అనేది జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ టెక్నిక్. మీ దగ్గరున్న డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలన్న అంశాన్ని ఈ టెక్నిక్ నేర్పిస్తుంది. డబ్బు పొదుపు చేయడానికి ఈ టెక్నిక్ మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. విచ్చలవిఉిగా డబ్బులు ఖర్చుపెట్టివారైనా సరే… ఈ టెక్నిక్‌ను అర్ధం హనుకొన అమలు చేస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. పొదుపు పెంచుకోవచ్చు.
అసలు కాకీబో అంటే ఏంటంటే…
ఇంటి జమాఖర్చుల్ని రాసే పుస్తకం అని అర్ధం. 1904 సంవత్సరంలో హని మొటోకో అనే మహిళ కాకీబో టెక్నిక్‌ను పరిచయం చేశారు. కొందరు అవసరానికి మించిన ఖర్చులు చేసి అప్పులపాలవడం మనం చూసూనే ఉంటాం. ఆన్‌లైన్ షాపింగ్ వలలో పడి అవసరం లేకపోయినా వస్తువులు కొనేవారినీ చూస్తుంటాం. అలాంటివారికి తమ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడానికి 116 ఏళ్ల నాటి ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఓ వస్తువు కొనాలనుకునే ముందు ఈ కింది / ప్రశ్నలు మీకు మీరే ప్రశ్నలు వేసుకోవాలి.
1. ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా?
2. నా ఆర్ధిక పరిస్థితులను బట్టి ఈ వస్తువు కొనగలిగే స్తోమత నాకు ఉందా?
3. నేను ఈ వస్తువును ఉపయోగిస్తానా?
4. ఈ వస్తువు దాచుకోవడానికి ఇంట్లి స్థలం ఉందా?
5. ఆ వస్తువును నేను మొదటిసారి ఎక్కడ చూశాను?
6. ఈ రోజు నా మానసిక స్థితి ఎలా ఉంది?
7. ఈ వస్తువు కొన్న తర్వాత నేను ఎలా ఉంటాను?
ఏదైనా వస్తువు కొనేముందు 7 ప్రశ్నలు వేసుకోవాలి. వాస్తవానికి / ప్రశ్నలు అవసరం లేదు. మొదటి 4 ప్రశ్నలకే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. మొదటి నాలుగు ప్రశ్నల్లో మీకు ఈ వస్తువు అవసరం లేదు అనిపిస్తే కొనొద్దు. మీ ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది.