ఈ అల్లరి పిడుగుని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

[ad_1]
హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. క్రేజీ హీరోయిన్స్ లేటెస్ట్ పిక్స్ నుంచి చైల్డ్ హుడ్ ఫోటోల వరకు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆమె ఎవరో కాదు వర్ష బొల్లమ్మ. దర్శకుడు అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా 2019లో విడుదలైన 'బిగిల్' సినిమాలో వర్ష బొల్లమ్మ నటించింది. 2022లో విడుదలైన తమిళ చిత్రం 'అక్క కురువి'లో ఆమె చిన్న పాత్ర పోషించింది. సినిమాలతో చాలా బిజీగా ఉండే వర్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.
నటి వర్ష బొల్లమ్మ 30 జూలై 1996న కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. 2015లో తమిళంలో విడుదలైన 'సతురన్' సినిమాతో తమిళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అలాగే తెలుగులో చూసి చూడంగానే అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.
జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ చిన్నది. పుష్పకవిమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం, ఊరు పేరు భైరవకోన అనే సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ వయ్యారి. వర్ష బొల్లమ్మ క్రేజీ ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
[ad_2]
Source link