ఇ ఎఫ్ ఐ అతిపెద్ద మెడిసిన్స్ కుంభకోణం చూస్తే ఇలానా అంటారు
The biggest Medicines scandal in the EFI is called Ilana

ఇఎస్‌ఐలో జరిగిన భారి స్కామ్ లో బినామీలుగా వందలాది పెర్లు బయటపడ్డాయి. ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా దేవిక రాణి ఇఎస్‌ఐ
డైరెక్టర్‌గా బాధ్యతలు స్వికరించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పూర్తి లావాదేవీయలపై ఎసిబి అధికారులు ఆరాతీశారు. ఇఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా మందులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు 200 మెడికల్ ఏజెన్సీల రికార్డులు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించారు. కేవలం మూడేళ్ల కాలంలో దేవికారాణి రూ.200 కోట్ల మేరకు అక్రమంగా ఆర్టించినట్లు గతంలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు దర్యాపులో వెలుగుచూసింది. ఈ స్కాంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పైవేటు వ్యక్తుల ప్రమేయంపై ఎసిబి, విజిలెన్స్ ఉన్నతాధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ అవినీతి వ్యవహారంలో ఐఏఎస్ అధికారి, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సూపరిండెంట్‌తో పాటు ఓ ఛానెల్ ప్రతినిధి హస్తం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.
దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా విధులు చేపట్టినప్పటి నుంచి తేజఫార్మ పుంజుకుంది. తేజాఫార్మను బినామీగా చేసుకుని కోట్లాది రూపాయల మందుల కొనుగోళ్లకు పాల్పడినట్లు తేలింది. బినామి మెడికల్ డిస్టిబ్యూషన్ కంపెనీలతో చేతులు కలిపి మందులు సరఫరా కానప్పటికీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిందని ఎసిబి అధికారులు తమ రిమాం డ్ రిపోరగ్ల్‌లో పేరొ,న్సారు.