ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ కెమెరా ఉన్న 8 స్మార్ట్‌ఫోన్లు ఇవే చూస్తే సూపర్ అంటారు
These are the 8 smartphones that have the best camera trending in the market right now and are called super

చాలా మందికి స్మార్ట్ ఫోన్లలో కెమెరా క్వాలిటీ చూసి కొనటం అలవాటు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కొనేప్పుడు మంచి కెమెరా ఉన్న మోడల్ కోసం సెర్చ్ చేస్తుంటారు. మరి అలాంటి వారు, కెమెరా ప్రియులు.. బెస్ట్ కెమెరా ఉన్న 8 స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్: ఇటీవల సాంసంగ్ సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. తొలిసారి సోనీ కెమెరాతో సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇందులో రియర్ కెమెరా 64+12+5+5 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 32మెగాపిక్సెల్ ఉంది. దీంతో పాటు 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ ఛార్జింగ్, 64 మెగాపిక్సెల్ ఇంటెల్లీ క్యామ్, సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే ఉంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 10+సాంసంగ్ వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మిరేజ్ బ్లూ, మిరేజ్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,499.
వన్ ప్లస్ నార్డ్ : వన్‌ప్లస్ నుంచి తక్కువ బడ్జెట్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్. ఇందులో సోనీ కెమెరా ఉండటం విశేషం. రియర్ కెమెరా 48+8+5+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 32+8 మెగాపిక్సెల్. వన్‌ప్లస్ నార్డ్ ప్రత్యేకతలు చూస్తే 5జీ స్మార్ట్‌ఫోన్. అంటే 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్ మార్చాల్సిన అవసరం లేకుండా ఇదే ఫోన్‌లో 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాససర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ 4,115ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ బ్లూ మార్బుల్, గ్రే ఓనిక్స్ కలర్స్‌లో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999.
పోకో ఎక్స్2 : పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా సోనీ కెమెరా ఉంటుంది. రియర్ కెమెరా 64+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 20+2 మెగాపిక్సెల్. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, ఓ వైఫై సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో ఎక్స్2 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.17,499 కాగా హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.21,499.
రియల్‌మీ ఎక్స్2: రియల్‌మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండగా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉన్నాయి. దీంతో పాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W వూక్ ఫ్లాష్ ఛార్జ్ 4.0, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ ఎక్స్2 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉండటం విశేషం. రియల్‌మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ 4000 ఎంఏహెచ్. 30W VOOC FLASH CHARGE 4.0 సపోర్ట్ ఉంది. రియల్‌మీ ఎక్స్2 పెరల్ వైట్, పెరల్ బ్లూ, పెరల్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. రియల్‌మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.17,999 కాగా, 8జీబీ+128జీబీ ధర రూ.20,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.22,999.
యాపిల్ ఐఫోన్ 11 ప్రో: యాపిల్ ఐఫోన్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో రియర్ కెమెరా 12+12+12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఐఫోన్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 5.8 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ర్యామ్ 6 జీబీ కాగా ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ 3,190 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13. ఐఫోన్ 11 ప్రో స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్, మిడ్‌నైట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.1,06,600.
షావోమీ ఎంఐ 10: ఇందులో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌తో భారీ కెమెరా ఉంది. రియర్ కెమెరా 108+13+2+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ఫ్లే, 90Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 5జీ కనెక్టివిటీ సపోర్ట్, వైఫై 6 సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. షావోమీ ఎంఐ 10 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ 4,780 ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐయూఐ 11+ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.47,500 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.50,370.
షావోమీ ఎంఐ ఏ3: ఎంఐ ఏ3 షావోమీ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో సోనీ కెమెరా ఉంటడం విశేషం. రియర్ కెమెరా 48+8+2 మెగాపిక్సెల్ కాగా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, టియర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. షావోమీ ఎంఐ ఏ3 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.08 అంగుళాల హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉండటం విశేషం. బ్యాటరీ 4,030 ఎంఏహెచ్. 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నాట్ జస్ట్ బ్లూ, మోర్ ద్యాన్ వైట్, కైండ్ ఆఫ్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ ధర రూ.12,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.14,999.
రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ కెమెరా ఉండగా, 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ఉంది. రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ఉన్నాయి. బ్యాటరీ 5020 ఎంఏహెచ్. 6జీబీ+64జీబీ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.18,999.