ఇప్పటి నుండి ఫోన్ కంటే ప్రతి మొబైల్ లో ఈ Arogya Setu యాప్ కంపల్సరీ
This Arogya Setu App compulsory on every mobile phone from now on

ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. కానీ కాలక్రమేణా వాటి రూపం కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడు వాటిని మనం ఫొటోలు తీసుకోవడానికి, డాక్యుమెంట్లు సేవ్ చేసుకోవడానికి, బ్యాంకింగ్ చేయడానికి, ఇంటర్నెట్ చూడటానికి అన్నిటికి ఉపయోగిస్తూ ఉన్నాం…అయితే ఇక మీదట కొత్త మొబైల్ ఫోన్ వినియోగించే వారు విధిగా తమ వివరాలను ఆరోగ్య సేతు యాప్‌లో రిజిష్టర్ చేసుకోవాలట.
లాక్‌డౌన్ తర్వాత దేశంలో అమ్ముడయ్యే ప్రతి స్మార్ట్‌ఫోనలో ముందస్తు సేవల కింద ఆరోగ్య సేతు యాప్ ఉంటుందని సమాచారం. కొత్త ఫోన్ కొనుగోలు చేసినవారు దానిని ఉపయోగించడానికి ముందు యాప్‌లో తప్పనిసరిగా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. త్వరలోనే కేంద్రం ఈ నిబంధనను అమలులోకి తేనుందట. ఈ విషయాన్ని కెంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఒక ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు. దిని అమలు కోసం కేంద్రం త్వరలోనే కొత్త నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు 2 తనులతనము ఈ ఏజెన్సీ స్మార్ట్‌ఫోన్ తయారి కంపెనీలతో సమయన్వయం చేసుకుంటూ, యాప్‌ను అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటుందట.
ఈ మెరకు వినియోగదారులు తప్పనిసరిగా వివరాలు రిజిస్టర్ చేసుకునే విధంగా ఫోన్లలో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఇన్‌బిల్ట్ ఫీచర్ కింద అందివ్వనున్నారు. కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసెందుకు రూపొందించిన ఈ యాప్‌ను దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
రాబోయే రోజుల్లో మరింత మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలానే కరోనా ముప్పుపై హెచ్చరించేందుకు ఫచర్ ఫోన్ల కోసం కూడా కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే ఈ సాంకేతికతను పజలకు అందుబాటులోకి తేసామనాారు.