ఇండియా దెబ్బకు చైనాకు ఎంత నష్టమో తెలుసా?
How much damage did China do to India's loss?

ఇండియా చైనా సరిహాద్దుల లో యుద్ధ వాతావరణ పరిస్థితులు ల లో చైనా ను ఆర్థికం గా దెబ్బకొట్టేందుకు చైనా కు సంబంధించిన కంపెనీలు,అప్ లు మరియు ఇతర ఉత్పత్తులపై పరిమితులు లేదా బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే .
చైనా కు ఇండియా దెబ్బ
అందులో భాగంగా టిక్ టాక్, హెలో, విగో వీడియో వంటి యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధించడం వల్ల వీటి మాతృ సంస్థ అయిన బైట్‌డాన్స్‌కు 6 బిలియన్ డాలర్ల (రూ.45 వేలకోట్లు దాదాపు) నష్టం వాటిల్లుతుందని చైనా మీడియా సంస్థ పేర్కొంది.
బైట్‌డాన్స్‌కు ఘోరమైన దెబ్బ
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బైట్‌డాన్స్‌కు ఘోరమైన దెబ్బ అని చైనా ప్రభుత్వ అధికారిక వార్త సంస్థగా చెప్పుకునే గ్లోబల్ టైమ్స్ నివేదిక విడుదల చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ 1 బిలియన్ డాలర్లకు పైగా భారతీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిందని, ఈ నిషేధం కారణం గా భారత్ లో బైట్‌డాన్స్ వ్యాపారాన్ని నిలిపి వేయవలసి వస్తుందని , దీనివల్ల 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని బైట్‌డాన్స్ యాజమాన్యానికి గల సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
గ్లోబల్ టైమ్స్
గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన తన నివేదిక ప్రకారం, ‘మొబైల్ అప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, టిక్ టాక్ మే నెలలో 112 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది, భారత మార్కెట్లో మొత్తం 20 శాతం, అంటే అమెరికా కంటే రెట్టింపు వినియోగదారులు ఉన్నారని ‘పేర్కొంది.
భారతదేశంలో 59 యాప్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం జూన్ 29 న ఆదేశాలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్‌ల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అవుతున్నట్లు వివిధ వనరుల నుండి ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది.
ఎలక్ట్రానిక్స్ మరియు ఐటిమంత్రిత్వ శాఖ
ఈ నివేదికలు అన్నీ సమగ్రంగా పరిశీలించి, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను ప్రభావితం చేసే భారతదేశ జాతీయ భద్రత మరియు రక్షణకు విరుద్ధమైన అంశాల ద్వారా దాని మైనింగ్ మరియు ప్రొఫైలింగ్ లాంటి వాటికి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని.ఎలక్ట్రానిక్స్ మరియు ఐటిమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపాయి.