Sports news

ఫోన్ పే వినియోగదారులకు తీపి కబురు

Phone Pay users got the sweetbird

ఆర్దిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు కూడా విధించింది… ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పె ఇబ్బందుల్లో పడింది.

బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుపై ఆంక్షల నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రండు రోజులుగా ఫోన్‌పేలో లావాదేవీలు నిలిచిపోయాయి… ఈక్రమంలో ఫోన్‌పే యాజమాన్యం సేవలను పునరుద్దరించే
చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐసిఐసిఐ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది…

ఈ ఒప్పందం ప్రకారం ఇకనుంచి ఫోన్‌పేకు యస్‌ బ్యాంకు స్థానంలో ఐసిఐసిఐ నగదు సర్దుబాటు చేయనుంది. ఈ
మేరకు ఫోన్‌పే ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సమీర్‌ నిగమ్‌ ప్రకటించారు.

సరైన సమయంలో ఆదుకున్నందుకు ఐసిఐసిఐ బ్యాంకుతో పాటు నేషనల్‌ పిమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పిసిఐ)కు ధన్యవాదాలు తెలిపారు. యస్‌ బ్యాంకు సంక్షోభంతో ఫోన్‌పెతో పాటు మరో 15 థర్డ్‌ పార్టీ పేమెంట్స్‌ సంస్థల సర్వీసులు నిలిచిపోయాయి…దీంతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు వాలెట్‌ సర్వీసులు
కూడా తిరిగి అందుబాటులోకి రానున్నాయి…

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close