Tips & TricksTop newsTrending newsViral news

ఆన్లైన్లో బిఎఫ్ విత్ డ్రా చేయండి ఇలా కొత్త పద్ధతి

Withdrawal or clearing facility of PF Online

పిఎఫ్‌ ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా లేదా క్లియిమ్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు పఎఫ్‌ సొమ్మును శ్లియిమ్‌ చేయాలంటే మీరు ఇంతకుముందు ఉద్యోగం చేసిన సంస్థ చుట్టునో, ఎిఫ్‌ కార్యాలయం చుట్టునో తిరగాల్సి ఉండేది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పిఎఫ్‌ ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ చేసుకునేందుకు ఈపిఎఫ్‌వో వీలు కల్పిస్తోంది. మీరు ఆన్‌లైన్లో అప్లె చేసిన ఐదురోజుల్లో నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి పిఎఫ్‌ సొమ్ము వచ్చి పడుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పీఎఫ్‌ వెబ్‌సైట్‌ పిఎఫ్‌ ఆన్‌లైన్‌ క్లియిమ్‌ కోసం www.epfindia.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మీ ముందు పీఎఫ్‌ సంబంధిత వివరాలను కలిగిన వెబ్‌సైట్‌ ప్రత్యక్షమవుతుంది. ఈ వెబ్‌సైట్‌ హోం పేజిలోనే కుడిపక్క ఆన్‌లైన్‌ శ్లియిమ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. మీరు దానిపైన క్లిక్‌ చేయాలి. క్లిక్‌ చేయగానే యూఏఎన్‌ సాయంతో లాగిన్‌ అయ్యే విండో వస్తుంది.

మీరు ఇది వరకే పీఎఫ్‌ ఖాతా కలిగి ఉంటే మీ యాజమాన్యం మీకు యూఏఎన్‌ నెంబర్‌ సదుపాయం కల్పిస్తుంది. యూఏఎన్‌ లాగిన్‌ అయిన తర్వాత ఐదు ఆప్షన్లు కనిపిస్తాయి. మేనేజ్‌ అనే దానిలో మీరు కేవైసి వివరాలను అప్‌డేట్‌ చేయవచ్చు. అకౌంట్‌ అనే చోట పాస్‌ వర్డ్‌ మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌ సర్వీసు అనేది పఎఫ్‌ సొమ్ము సంబంధించిన ముఖ్యమైన ఆప్షన్‌. ఆన్‌లైన్‌ సర్విసెస్‌ అప్షన్‌లో ఉండే క్లెయిమ్‌, ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌, ట్రాక్‌ క్లెయిమ్‌ స్టేటస్‌ ద్వారా మీకు కావాల్సిన పనిచేసుకోవచ్చు. క్లెయిమ్‌ ఆప్షన్‌ నొక్కితే మీ ఆధార్‌ సంఖ్య కేవైస్‌ వివరాలతో పీఎఫ్‌ వెబ్‌సైట్‌ అప్‌డేట్‌ అయిందో లేదో తెలుస్తుంది. మీ కేవైసీ వివరాల వెరిఫికేషన్‌ పూర్తయితే మీరు ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ ను నేరుగా చేసుకోవచ్చు.

కేవైసి వివరాలు సరిగ్గా లేకపోతే వాటిని మీరు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాల్సి వస్తుంది. దీన్ని కేవైసి ప్రక్రియ పూర్తిచేయకుండా పీఎఫ్‌ ఆన్‌లైన్‌ క్లియిమ్‌ చేయడం కష్టం. హోం, వ్యూ తర్వాత మేనేజ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. అక్కడ కాంటాక్ట్‌ డీటెయిల్స్‌, కేవైసి అని ఉంటుంది. అక్కడ కేవైసిపై క్లిక్‌ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్‌ రకం, డాక్యుమెంట్‌ నెంబర్‌, మీ పేరు వంటి వివరాలను వెబ్‌సైట్‌ అడుగుతుంది. బ్యాంకు, పాన్‌, ఆధార్‌ వివరాలను ఇస్తే వెరిఫికేషన్‌
పూర్తవుతుంది. ఇక్కడ మీ ఆధార్‌లో ఉన్న పేరు, పుట్టిన తేది వెబ్‌సైట్లో ఉన్నవాటితో సరిపోలాలి. తర్వాత సేవ్‌ ఆప్షన్‌ నొక్కండి. ఒకసారి కేవైసి ప్రక్రియ పూర్తయితే మళ్లీ ఆన్‌లైన్‌ సర్వీస్‌లోకి వెళ్లి శ్లియిమ్‌ ఆప్షన్‌ నొక్కండి. దాన్ని పూర్తి చేస్తే 10 రోజుల్లోపు మీ ఖాతాలోకి పిఎఫ్‌ సొమ్ము జమ అవుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close