Trending news

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

[ad_1]

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఇలా మెరిసి అలా మాయం అవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయి ఫ్యాన్స్‌ను నిరాశపరిస్తుంటారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ముందుగా మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆతర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడమతొ సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలా కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. కానీ ఇప్పుడు అవి కూడా మానేసి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ఆ ముద్దుగుమ్మే పార్వతీ మెల్టన్ ఒక ఇండో అమెరికన్. మోడలింగ్ నుంచి ఈ అమ్మడు కెరీర్ మొదలు పెట్టింది.

ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

మోడలింగ్ నుంచి సినిమాఇండస్ట్రీలోకి వచ్చిన పార్వతీ మెల్టన్ రాజా హీరోగా నటించిన వెన్నెల సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాలోనే పార్వతీ మెల్టన్ తన అందంతో ఆకట్టుకుంది. గేమ్, అల్లరే అల్లరి సినిమాలు చేసింది. ఆతర్వాత మలయాళ భాషలో సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులో మధుమాసం అనే సినిమా చేసింది. హీరోయిన్ గా అంతగా సక్సెస్ కానీ ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.

ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

దాంతో ఈ అమ్మడి మంచి గుర్తింపు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈసాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. 2012 తర్వాత పార్వతీ మెల్టన్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంది. అప్పటికీ ఇప్పటికీ పార్వతీ మెల్టన్ చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా తయారయ్యింది. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. ఈ అమ్మడిని సడన్ గా చూస్తే గుర్తుపట్టడం కాస్త కష్టమే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close